కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
సియెల్: కొరియా ఓపెన్ సూపర్‌ా300 బ్యాడ్మింటన్ టోర్నీ సింగిల్స్‌లో భారత షట్లర్ల పోరాటం ముగియగా.. పురుషుల డబుల్స్‌లో చిరాగ్‌శెట్టి-సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి జోడీ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రి క్వార్టర్స్‌లో చిరాగ్-సాత్విక్ జంట 21-17, 21-15తో 5వ సీడ్, జపాన్‌కు చెందిన టకురోాయుగో కొబయాషీపై విజయం సాధించారు. క్వార్టర్స్‌లో భారత జంట చైనాకు చెందిన టింగ్‌ాజో యంగ్‌లతో తలపడనున్నారు. ఇక పురుషుల సింగిల్స్‌లో రెండోరౌండ్ పోటీలో హెచ్‌ఎస్ ప్రణరు రారు, ప్రియాంశు రాజవత్ ఓటమిపాలయ్యారు. ప్రణరు 15-21, 21-19, 18-21తో హాంకాంగ్‌కు చెందిన లీ-చౌక్-యు చేతిలో, ప్రియాంశు 14-21, 21-19, 17-21తో జపాన్‌కు చెందిన నరోకా చేతిలో ఓడారు. ఇక మహిళల డబుల్స్‌లో త్రీసా జోలీాగాయత్రీ గోపీచంద్ జోడీ 11-21, 4-21తో కేవలం 33 నిమిషాల్లోనే కొరియా జోడీ చేతిలో ఓడి ఇంటిదారి పట్టారు. అలాగే మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్‌ాసిక్కిరెడ్డి జంట 15-21, 12-21తో చైనాకు చెందిన ఫెంగ్ యన్-హుయాంగ్ డెంగ్ పింగ్ చేతిలో వరుససెట్లలో పరాజయాన్ని చవిచూశారు.










