Aug 15,2023 14:49

ప్రజాశక్తి-అమలాపురం రూరల్‌ : 77 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమలాపురం రూరల్‌ మండలం పేరూరు డి.ఎన్‌.శెట్టి, డి.వి.రెడ్డి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు 1996-1997 బ్యాచ్‌ విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు మట్టపర్తి పురుషోత్తం రాజుకు సెంట్రల్‌ సౌండింగ్‌ సిస్టం ఏర్పాటుకు రూ.25 వేలు విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ కడలి భాస్కర రావు, పేరూరు పంచాయతీ ఉప సర్పంచ్‌ కుడుపూడి సత్యనారాయణ, ఎంపిటిసి దొంగ ఆంజనేయులు, దొమ్మేటి సుబ్రహ్మణ్యం, దొమ్మేటి శ్యామ్‌ ప్రకాష్‌, జల్లి శ్రీను, చెల్లుబోయిన రమేష్‌, దొమ్మేటి రాధాకృష్ణ,ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.