గుంటూరు : గుంటూరు స్థానిక కొత్తపేటలోని డాక్టర్ అనుమానస్పదస్థితిలో మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. సురక్ష ఆసుపత్రిలో ఫిజియోథెరపి డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సీతారామాంజనేయులు తన ఇంట్లో గాయాలతో మృతి చెంది ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. సీతారామాంజనేయులు నాలుగు నెలల క్రితం స్వాతి రెడ్డి ని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఎం ఫార్మసీ చేసేందుకు ఇటీవలే భార్య స్వాతి రెడ్డి అమెరికాకు వెళ్లారు. ప్రేమ వివాహం నేపథ్యంలో హత్య జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఘటనపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










