న్యూఢిల్లీ : ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఈ నెల 30వ తేదీ వరకు టిడిపి అధినేత చంద్రబాబును అరెస్టు చేయొద్దు అని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఫైబర్ కేసు విషయంలో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో చేపట్టిన విచారణ వాయిదా పడింది. ఈనెల 30 న తిరిగి విచారణ చేపడతామని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం తెలిపింది. మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విషయమైన తీర్పును దీపావళి సెలవుల తర్వాత వెల్లడిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.










