Sep 06,2023 15:05

ప్రజాశక్తి-కర్నూలు స్పోర్ట్స్‌ : కర్నూలు జిల్లా రోలర్‌ స్కేటింగ్‌ పోటీలను నిర్వహిస్తున్నారని జిల్లా రోలర్‌ స్కేటింగ్‌ సంఘం కార్యదర్శి బైరెడ్డి పక్కిరెడ్డి, ఉపాధ్యక్షులు పి.సునీల్‌ కుమార్‌ సంయుక్త ప్రకటనలో తెలిపారు. స్కేటింగ్‌ ఎంపిక పోటీలను 9 తేదీ శనివారం ఉదయం 8 గం కర్నూలు జిల్లా ఔట్‌ డోర్‌ స్టేడియంలోని స్కేటింగ్‌ రింక్‌లో నిర్వహిస్తారని తెలిపారు. ఇన్లైన్‌, క్వాడ్‌ స్కేటింగ్‌ క్రీడంశలలో పోటీని రింక్‌ రేస్‌ , రోడ్‌ రేస్‌లలో నిర్వహిస్తారన్నారు. ఆసక్తి ఉన్న స్కేటింగ్‌ క్రీడాకారులు ప్రవేశరుసుము, వయో ధృవికరణ పత్రలతో పేర్లు నమోదు చేసుకొని పాల్గొనాలని తెలిపారు. మరిన్నీ వివరాలకు నెంబర్‌ 9010501082ను సంప్రదించాలని వారు కోరారు. ఎంపికైన వారు జిల్లా స్థాయి పోటీలకు అర్హత పొందుతారు అని వారు వివరించారు.