ప్రజాశక్తి-చల్లపల్లి(కృష్ణా) : విద్యుత్ శాఖ చల్లపల్లి సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ పులి శివ నాగేశ్వరరావు కృష్ణాజిల్లా ఉత్తమ డీఈఈ అవార్డు అందుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా మచిలీపట్టణంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ చేతుల మీదుగా అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు చల్లపల్లి విద్యుత్ శాఖ ఏఈఈ అరవింద్ కుమార్, సబ్ డివిజన్ ఏఈఈలు, అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.










