కర్నూలు :ఈ నెల 26 27 తేదీలలో ప్రకాశం జిల్లా చీమకుర్తిలో నిర్వహించిన 5వ రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్ పోటీలకు జిల్లా చెందిన 20 మంది క్రీడాకారులు పాల్గనే జట్టును శుక్రవారం టీజీ భారత్ అభినందించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు శ్రీ టీ.జీ వెంకటేష్ స్వగఅహంలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కర్నూలు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ టి జి భరత్ విచ్చేసి మాట్లాడుతూ ఎంపికైన క్రీడాకారులకు అభినందిస్తూ మన జిల్లాకు రాష్ట్రస్థాయి కరాటే పోటీలో పథకాలు సాధించాలని అన్నారు. అనంతరం క్రీడాకారులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు మాస్టర్స్ కే క్రాంతి కుమార్, ఎస్ శ్రీనివాస్ పాల్గొన్నారు.










