Aug 02,2023 15:54

ప్రజాశక్తి- దేవనకొండ (కర్నూలు) : రాష్ట్ర ప్రభుత్వము బాలింతలు, గర్భవతులకు, చిన్నారులకు అంగనవాడి కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్న పోషక ఆహార కిట్లను సద్వినియోగం చేసుకోవాలని మండల తహశీల్దార్‌ వెంకటేష్‌ నాయక్‌, మండల జడ్పిటిసి కిట్టు తెలిపారు. బుధవారం మండల కేంద్రమైన దేవనకొండ అంగన్వాడీ కేంద్రం-6లో పోషక ఆహార కిట్లను ఐసిడిఎస్‌ సూపర్వైజర్స్‌ శివలింగమ్మ, షాహినా బేగం ఆధ్వర్యంలో బాలింతలు, గర్భవతులకు పంపిణీ చేశారు. అదేవిధంగా తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోషక ఆహారంతోనే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిటిసి తపాల శ్రీనివాసులు, తెర్నేకల్‌ సర్పంచ్‌ అరుణ్‌ కుమార్‌, వైసిపి నాయకులు చాప వీరన్న, రాఘవేంద్ర, హెల్త్‌ సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు జ్యోతి, సరస్వతి, ఎర్రమ్మ, హుస్సేన్‌ అమ్మ, వెంకటేశ్వరమ్మ, వెంకటలక్ష్మి, మహిళా పోలీస్‌ సుహాసిని పాల్గొన్నారు.