Sep 01,2023 15:32

ప్రజాశక్తి -అనంతపురం కార్పొరేషన్‌ :నగరంలోని 29,37,38,44 వ డివిజన్‌ ల పరిధిలో నూతనంగా మంజూరు అయిన సామాజిక భద్రతా పింఛన్లను శుక్రవారం మేయర్‌ మహమ్మద్‌ వసీం పంపిణీ చేసారు .ఈ సందర్భంగా మేయర్‌ వసీం మాట్లాడుతూ అర్హత ఉన్న లబ్ధిదారులకు నూతనంగా 628 పింఛన్లు నగరంలో మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. దేశంలో ఏక్కడా లేని విధంగా ఇంటి వద్దకే తెల్లవారుజామునే పింఛన్లు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రమే అని కొనియాడారు.అదే విధంగా 29వ డివిజన్‌ లో నూతన రేషన్‌ కార్డ్‌ లను సైతం లబ్ధిదారులకు అందించారు. ఆయా కార్యక్రమాలలో కార్పొరేటర్లు అనిల్‌ కుమార్‌ రెడ్డి,సైఫుల్లా బేగ్‌,కమల్‌ భూషణ్‌ ,కార్యదర్శి సంగం శ్రీనివాసులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.