ప్రజాశక్తి-మద్దికేర (కర్నూలు) : మద్దికేర మండలంలోని సచివాలయ పరిధిలోని అన్ని గ్రామాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష టోకెన్లు పంపిణీ చేస్తున్నట్లు వైద్యాధికారులు డాక్టర్ నగేష్ శ్రీలక్ష్మి తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా మంగళవారం అగ్రహారం గ్రామంలో వాలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సర్వేతోపాటు ఆరోగ్యపరీక్షలు నిర్వహిస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష టోకెన్లు అందజేశారు. మద్దికేర మండలం పరిధిలోని గ్రామస్తుల ఆరోగ్య సమస్యలు ఉన్నవారి వివరాలు నమోదు చేసుకొని ఈనెల 30 నుండి ప్రారంభమయ్యే వైద్య శిబిరంలో ప్రత్యేక వైద్యాధికారులతో చికిత్స నిమిత్తం టోకెన్లు పంపిణీ చేస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మెరుగైన వైద్య సేవలు అందజేయడం ప్రజలందరికీ ఆరోగ్యం అందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ధ్యేయం అని వైద్యాధికారులు ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్షేత్ర స్థాయిలో వైద్యాధికారులు శ్రీలక్ష్మి, డాక్టర్ నగేష్ గ్రామీణులకు టోకెన్లు అందజేశారు. అనంతరం హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ బాషా మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పై క్షేత్రస్థాయిలో ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు విస్తఅతంగా అవగాహన కలిగించాలని, సర్వేను పకడ్బందీగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు కృష్ణమ్మ, సూర్యనారాయణ, ప్రకాష్ రావు, హెల్త్ ప్రొవైడర్లు అరుణ, గోపీ లక్ష్మి, ఆరోగ్య కార్యకర్తలు పుష్ప, గాయత్రి ,వాలంటీర్లు ,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.










