హైదరాబాద్: వైకల్యం అనేది శరీరానికే తప్ప మనసుకు కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన వికలాంగుల కఅతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. వికలాంగుల కోసం తొమ్మిదిన్నరేళ్లలో రూ.10,300 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ 3 నుంచి 4 శాతానికి పెంచినట్లు గుర్తు చేశారు.''వికలాంగులకు ప్రస్తుతం రూ.4,016 పింఛన్ ఇస్తున్నాం. కేసీఆర్ మళ్లీ సీఎం కాగానే రూ.6,016కు పింఛన్ పెంచుతాం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటకలో ఇస్తున్న పింఛన్ రూ.1,100. ఛత్తీస్‌గఢ్‌లో రూ.4 వేలు పింఛన్ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇస్తుందా? ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో గుజరాత్‌లో బిజెపి సర్కారు ఇస్తున్న పింఛన్ రూ.600 నుంచి రూ.వెయ్యి మాత్రమే. కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ కాదు.. 11 సార్లు అవకాశం ఇచ్చారు'' అని కేటీఆర్ అన్నారు.










