Nov 06,2023 16:46

హైదరాబాద్‌: ప్రజల కోసమే తెలంగాణ ఎన్నికల్లో పాల్గనకుండా ఉన్నామని వైఎస్సార్‌టీపి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ఎవరో తమకు కిరీటాలు పెట్టాలని కోరుకోవడం లేదన్నారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై కేసు కొట్టేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. అన్ని పార్టీల్లో దొంగలుంటారని.. కానీ ఆ దొంగలు సీఎంలు కాకూడదని ఆమె వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకఅష్ణారెడ్డిని ఉద్దేశించి షర్మిల పలు వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌టీపితో సంబంధం లేదని గతంలో సజ్జల అన్నారని.. ఇప్పుడు ఏ సంబంధం ఉందని తన గురించి ఆయన మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తాము మాత్రం సంబంధం లేదనే అనుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ''మాతో సంబంధం గురించి సజ్జలే సమాధానం చెప్పాలి. ఏపీలో రోడ్లు, విద్యుత్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్‌ బాహాటంగానే విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై సజ్జల ఏం సమాధానం చెబుతారు?సజ్జల గారూ.. ముందు మీ కథ మీరు చూసుకోండి'' అని షర్మిల ఎద్దేవా చేశారు.