ప్రజాశక్తి-గూడూరు (కృష్ణా) : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం గూడూరు మండలం మల్లవోలు గ్రామంలో ఉపాధి కూలీలను కలసి వారి సమస్యలు తెలుసుకున్నామని సిఐటియు కృష్ణా జిల్లా అధ్యక్షుడు చౌటపల్లి రవి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం చౌటపల్లి రవి మాట్లాడుతూ ... ఉపాధి కూలీని రూ.600 పెంచాలని , రెండువందల రోజులు పని దినాలు కల్పించాలని, ఎఫ్‌ఎ లకు మ్యాండేస్ తో నిమిత్తం లేకుండా వేతనం రూ.26,000 ఇవ్వాలని, గతంలో ఇచ్చిన టెంట్ కి, పలుగుకి, మంచినీళ్లకు, మెడికల్ కిట్టుకు, మెట్ కు ఇచ్చే పారితోషికాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వీటన్నిటి విషయమై మే 29వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి.గోపాలరావు, సిఐటియు గూడూరు మండల కార్యదర్శి భాషా, తదితరులు పాల్గొన్నారు.










