Oct 31,2023 20:59

ప్రజాశక్తి-విజయనగరం కోట:విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలం అంటకాపల్లి సమీపాన జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన ఓ వ్యక్తి వివరాలు మంగళవారం లభ్యమయ్యాయి. ఈ సంఘటనలో 13 మంది మృత్యువాత పడగా, 12 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి సోమవారం సాయంత్రం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఓ యువకుడి వివరాలు తెలియకపోవడంతో ఆ మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. కర్నూలు జిల్లాకు చెందిన వాసిగా ఆ యువకుడిని గుర్తించినప్పటికీ పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం ఆగసనూరు గ్రామానికి చెందిన చాకలి తాయప్ప (20)గా గుర్తించారు. మృతుని వద్దనున్న ఆధార్‌ కార్డు ఆధారంగా తండ్రి చాకలి పాలన్నకు వచ్చిన సమాచారం బట్టి మృతుడిని గుర్తించారు. తయాప్పకు ఇద్దరు చెల్లెల్లు, తల్లి నాగమ్మ ఉన్నారు.