ప్రజాశక్తి -కలకడ (రాయచోటి) : నాటు సారా ఊటను ధ్వంసం చేసినట్లు ఎస్సై తిప్పేస్వామి తెలిపారు. శనివారం ఎస్సై ప్రజాశక్తితో మాట్లాడుతూ ... మండలంలోని దిగువ తండా పంచాయతీ దిగుతాండ సమీపంలో ఉన్న గుట్ట ప్రాంతంలో నాటు సారా తయారు చేయడానికి ఉంచిన 400 లీటర్ల ఊటను పోలీసులు గుర్తించి వాటిని ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ ... నాటు సారాను ఎవరైనా తయారుచేసినా, విక్రయించినా, తరలించినా వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రాజేంద్ర నాయక్, తాతయ్య, హౌంగార్డ్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.










