Aug 03,2023 22:30

ఫైనల్లో ఈస్ట్‌జోన్‌పై 45 పరుగుల తేడాతో గెలుపు
పుదుచ్ఛేరి: దేవధర్‌ ట్రోఫీని సౌత్‌జోన్‌ జట్టు కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో సౌత్‌జోన్‌ జట్టు 45 పరుగుల తేడాతో ఈస్ట్‌జోన్‌పై ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన సౌత్‌జోన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 328పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఓపెనర్‌ రోహన్‌ కున్నుమ్మల్‌(107), కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌(63) తొలి వికెట్‌కు 181పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వికెట్‌ కీపర్‌ నారాయణ్‌ జగదీశన్‌(54), రోహిత్‌ రాయుడు(26), సాయి కిషోర్‌(24) బ్యాటింగ్‌లో రాణించారు. షాబాజ్‌, రియాన్‌ పరాగ్‌, ఉత్కర్ష్‌ సింగ్‌కు రెండేసి, మణిశంకర్‌, ఆకాశ్‌దీప్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఛేదనలో ఈస్ట్‌జోన్‌ టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్స్‌ నిరాశపరిచినా.. మిడిలార్డర్‌ బ్యాటర్‌ రియాన్‌ పరాగ్‌(95), కుమార్‌ కుశాగ్ర(68), సుదీప్‌(41) రాణించడంతో వెస్ట్‌జోన్‌ జట్టు ఓ దశలో లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయి 46.1 ఓవర్లలో 283పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్‌ సుందర్‌కు మూడు... కవిరప్ప, కౌశిక్‌, విజయ్ కుమార్‌కు రెండేసి, సాయి కిషోర్‌కు ఒక వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కన్నుమ్మల్‌కు లభించింది.