Jul 26,2023 20:51
  • వెస్ట్‌జోన్‌పై 12పరుగుల తేడాతో గెలుపు

పుదుచ్చేరి: దేవధర్‌ ట్రోఫీలో సౌత్‌జోన్‌ జట్టు మరో విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో సౌత్‌జోన్‌ జట్టు 12 పరుగులు తేడాతో వెస్ట్‌జోన్‌పై సంచలన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన సౌత్‌జోన్‌ జట్టు 46.4ఓవర్లలో 206పరుగులకు ఆలౌటంది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(98), అరుణ్‌ కార్తీక్‌(23), విజరుకుమార్‌(20నాటౌట్‌) బ్యాటింగ్‌లో రాణించారు. భట్‌కు మూడు, ములానీ, హంగేగ్రేకర్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం సౌత్‌జోన్‌బౌలర్లు చెలరేగడంతోఛేదనలో వెస్ట్‌జోన్‌ జట్టు 36.2ఓవర్లలో 194పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. సర్ఫరాజ్‌()42), అతిత్‌ శేఠ్‌(40), శివమ్‌ దూబే(29) బ్యాటింగ్‌లో రాణించారు. సాయికిషోర్‌కు మూడు, సుందర్‌కు రెండు, కౌశిక్‌కు రెండేసి ఒక వికెట్‌ దక్కాయి. మరో పోటీలో ఈస్ట్‌జోన్‌ జట్టు 8వికెట్ల తేడాతో నార్త్‌-ఈస్ట్‌-జోన్‌పై, నార్త్‌జోన్‌ జట్టు 48పరుగుల తేడాతో సెంట్రల్‌జోన్‌ జట్టుపై విజయం సాధించాయి. దీంతో సౌత్‌, ఈస్ట్‌జోన్‌ జట్లు 8పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. వెస్ట్‌, నార్త్‌, సెంట్రల్‌ జోన్‌ జట్లు 4పాయింట్లతో ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగే మూడో లీగ్‌ మ్యాచ్‌లో సౌత్‌జోన్‌ జట్టు నార్త్‌-ఈస్ట్‌-జోన్‌తో, నార్త్‌జోన్‌ జట్టు ఈస్ట్‌జోన్‌తో, సెంట్రల్‌ జోన్‌ జట్టు వెస్ట్‌జోన్‌ జట్టుతో తలపడనున్నాయి.