Feb 11,2023 13:25

ప్రజాశక్తి-పుంగనూరు (చిత్తూరు) : పుంగనూరు పట్టణం నానాసాపేటలో ఉన్న సుమారు 20 పేదల ఇండ్లను పోలీసులు, మున్సిపల్‌ అధికారులు కలిసి ఉన్నపాటుగా కూల్చేశారు. అప్పటికప్పుడే కరెంట్‌ కనెక్షన్‌ తీసేశారు. ఇదేమిటని అడిగి నిరసన తెలిపిన బాధితులను, నిరసనకారులను అరెస్టు చేశారు. 
       పుంగనూరు పట్టణం నానాసాపేటలో ఉన్న సుమారు 20 పేదల ఇండ్లను మున్సిపల్‌ అధికారులు జెసిబిలతో కూల్చివేశారు. శనివారం ఉదయం నుంచి ఓవైపు పోలీసులు, మరోవైపు మున్సిపల్‌ అధికారులు పేదల ఇండ్లను కూల్చివేశారు. దీనిని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు, బాధితులు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. ఇండ్ల వద్ద తల్లిదండ్రులు లేకపోవడంతో పిల్లలు ఏం చేయాలో దిక్కుతోచక ఎక్కిళ్లు పెట్టి ఏడుస్తున్నప్పటికీ అధికారులు మాత్రం కనికరించలేదు. విద్యుత్‌ శాఖ అధికారులు అప్పటికప్పుడే విద్యుత్‌ లైన్లు కట్‌ చేయడం మీటర్లు తొలగించడం చేశారు.