Aug 04,2023 22:06

భారత్‌తో టి20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఐర్లాండ్‌
బెర్లిన్‌: భారత్‌తో జరిగే టి20 సిరీస్‌కు ఐర్లాండ్‌ను ఆ దేశ క్రికెట్‌ బోర్డు శుక్రవారం ప్రకటించింది. 15మందితో కూడిన జట్టులో మణికట్టు గాయం నుంచి కోలుకున్న లెగ్‌ స్పిన్నర్‌ గరెత్‌ డెలాని, ఆల్‌రౌండర్‌ ఫియోన్‌ హ్యాండ్‌లను సెలెక్టర్లు ఎంపిక చేశారు. భారత్‌తో టి20 సిరీస్‌ను చాలాకాలం తర్వాత ఐర్లాండ్‌ జట్టు ఆడుతోంది. ఆగస్టు 18న భారత్‌, ఐర్లాండ్‌ మధ్య మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు భారత పేసర్‌ జస్పీత్‌ బుమ్రా కెప్టెన్‌గా పునరాగమనం చేస్తున్నాడు.
జట్టు: స్టిర్లింగ్‌(కెప్టెన్‌), బల్‌బిర్నే, అడెయర్‌, రాస్‌ అడెర్‌, చాంఫర్‌, డెలాని, డాక్రెల్‌, హ్యాండ్‌, లిటిల్‌, మెక్‌కార్తీ, టెక్టర్‌, లర్కాన్‌ టక్కర్‌, వాన్‌ వొర్కమ్‌, బెన్‌ వైట్‌, క్రేగ్‌ యంగ్‌.