Sep 11,2023 10:23

చెన్నై : ప్రతిపక్షాల ఐక్య వేదిక 'ఇండియా' ఫోరం వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిస్తేనే దేశాన్ని రక్షించుకోగలమని తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షులు ఎంకె స్టాలిన్‌ తెలిపారు. నెవైలీలోని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. 2024 ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరిలోని మొత్తం 40 పార్లమెంట్‌ స్థానాలను డిఎంకె పార్టీ గెలుచుకోవాల్సిన ఆవశ్యకతను స్టాలిన్‌ తన ప్రసంగంలో వివరించారు. 'మనం ఆ స్థాయిలో ఘన విజయం సాధిస్తేనే.. తదుపరి అధికారంలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించగలం' అని స్టాలిన్‌ తెలిపారు. మొత్తం 40 స్థానాల్లోనూ డిఎంకె విజయం సాధించాలని పార్టీ కార్యకర్తలకు స్టాలిన్‌ పిలుపునిచ్చారు.