ప్రజాశక్తి- జంగారెడ్డిగూడెం(ఏలూరు జిల్లా) : జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. వైద్యులు నిర్లక్ష్యం వల్ల అప్పుడే పుట్టిన మగ బిడ్డ మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఆసుపత్రి గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










