- కాకినాడ జిజిహెచ్‌కి తరలింపు
ప్రజాశక్తి-తాళ్ళరేవు(కాకినాడ) :కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోపులంక వద్ద గోదావరిలో గల్లంతైన పశ్చిమగోదావరి జిల్లా తణుకు సజ్జాపురం గ్రామానికి చెందిన చెందిన తిరుమల రవితేజ(21), పెండ్యాల బాలాజీ,(20) అనుమకొండ కార్తీక్,(21) ముద్దన ఫణీంద్ర గణేష్(21), మృతదేహాలను ఆదివారం బయటకు తీశారు. గాలింపు చర్యలలో భాగంగా ఉదయం స్థానిక మత్సకారులు ముద్దన ఫణీద్ర గణేష్(21), పెండ్యాల బాలాజీ(21)ల మృతదేహాలను భయటకు తీశారు. అనంతరం గాలింపు ముమ్మరం చేశారు. ఈ గాలింపులో కొవ్వూరు ఫైర్ స్టేషన్ స్కూబా డైవింగ్ నిపుణుడు ప్రకాష్ ఆక్సిజన్ సిలిండర్‌తో సుమారు మూడు గంటల పాటు గోదావరి అండర్ వాటర్‌లో గాలించి హనుమకొండ కార్తీక్(21), తిరుమల రవితేజ(20) మృతదేహాలు బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాకినాడ డిఎస్పీ మురళీకృష్ణారెడ్డి, తహశృల్దార్ పోతురాజుల ఆద్వర్యంలో గాలింపు చర్యలను పర్యవేక్షించారు. ఇంజరం పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ అవసరమైన ఏర్పాట్లను చేశారు.










