Jun 11,2023 14:29

సముద్రం అనగానే టక్కున గుర్తొచ్చేవి అలలు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్రాల కంటే ఇది చాలా తక్కువ నీటితో ఉండి.. అలలు లేకుండా ఉండే సముద్రమే డెడ్‌ సీ... ఇజ్రాయెల్‌, జోర్డాన్‌ సరిహద్దుల మధ్య ఉంది. ఇందులో ఉండే కోబాల్ట్‌-బ్లూ నీటి వల్ల పక్షులు, చేపలు, మొక్కలు లాంటివేవీ బతకలేవు.. అందుకే దీన్ని 'డెడ్‌ సీ' (మృత సముద్రం) అని పిలుస్తారు. దీన్ని సాల్ట్‌ సీ, సీ ఆఫ్‌ లాట్‌ అని కూడా పిలుస్తారు. ఇందులోని నీరు సాధారణ సముద్రపు నీటి కంటే దాదాపు 10 రెట్లు ఉప్పగా ఉంటుంది. సముద్ర మట్టానికి 1,412 అడుగుల దిగువన ఉంది. 50 కిలోమీటర్ల పొడవు, 15 కిలోమీటర్ల వెడల్పాటి విశాలమైన భూ భాగంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత లోతైనది. నీటి సాంద్రత 1.240 కెజీ/లీగా ఉంటుంది. ఈ కారణంగా ఇందులో ఈత కొట్టకండానే తేలియాడేలా చేస్తుంది. స్ఫటికాకార సోడియం క్లోరైడ్‌ వల్ల రాళ్లు, ఇసుక మెరుస్తాయి.