Apr 18,2023 11:00

ప్రజాశక్తి-మోపిదేవి (కృష్ణా) : ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో ఉపాధి, భూమి, ఇల్లు సాధనకై జరుగుతున్న పోరాటంలో భాగంగా నిర్వహిస్తున్న సైకిల్‌ యాత్ర నాలుగో రోజు మంగళవారం మోపిదేవి మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా నేతలు కొత్తపాలెంలో ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకోగా తమకు ఇంతవరకు ఉపాధి హామీ పనులు చూపించలేదని గ్రామస్తులు నాయకులకు వివరించారు. నాయకులు మాట్లాడుతూ ... రెండు రోజుల్లో గ్రామంలోని ఉపాధి కూలీలకు పనులు చూపించకపోతే శనివారం ఎండిఓను కలిసి సమస్యను వివరిస్తామని ప్రజలకు తెలిపారు. ఉపాధి కార్మికులు నష్టపోతున్న భఅతిని గురించి వివరించి పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు వై నరసింహారావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శీలం నారాయణరావు, పోలాబత్తిన మోహన్‌ రావు, వాకా రామచంద్రరావు, యద్దనపూడి మధు, ఎండి.కరిముల్లా, బండి ఆదిశేషు, ధోని సహదేవుడు, చిట్టా రాజశేఖర్‌ పాల్గొన్నారు.