యాషెస్ సిరీస్ నాల్గో టెస్ట్
మాంచెస్టర్: యాషెస్ సిరీస్ నాల్గో టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 317పరుగులకు పరిమితం చేసిన ఇంగ్లండ్ జట్టు.. రెండోరోజు టి విరామ సమయానికి 2వికెట్ల నష్టానికి 239పరుగులు చేసింది. ఓపెనర్ క్రాలే(137నాటౌట్) భారీ శతకంతో కదం తొక్కగా.. మొయిన్ అలీ(54) అర్ధసెంచరీతో రాణించాడు. ఆ సమయానికి క్రీజ్‌లో సీనియర్ బ్యాటర్ రూట్(44) ఉన్నాడు. స్టార్క్‌కు రెండు వికెట్లు దక్కాయి.










