'కోట్లాది మంది భారతీయుల్లానే కొత్తిమీర లేకుండా నాకు వంటపూర్తి కాదు. కూరగాయలు, పప్పులతో చేసే వంటకాల్లోనే కాదు టమోటా, పచ్చిమిరప, వెల్లుల్లి కలిపి చేసే చట్నీలోనూ కొత్తిమీర ఉపయోగి స్తుంటాను. అంతెందుకు కొత్తమీర లేని నాన్‌వెజ్‌ను చేయలేం. బిర్యానీ వండలేం!' ఈ మాటలన్నది ఇప్పుడు దేశంలో పేరొందిన షెఫ్ రణవీర్ బ్రార్. ఈ కొత్తిమీరను 'భారతదేశ జాతీయ మూలిక' గా గుర్తించాలని ఆయన పిటిషన్ వేశారు.
కొత్తిమీరను దేశవ్యాప్తంగా వంటకాలలో వినియోగిస్తారు. ఉత్తర భారతదేశంలో 'ధనియా', దక్షిణాదిలో 'కొత్తిమీర, కోత్మీర్' అని పిలుస్తుంటారు. 'కొత్తిమీర లేకుండా భారత్‌లో దాదాపు ఏ వంటకమూ పూర్తికాదు. ఇంత విస్తృత వినియోగం ఉన్న వేరే మూలిక ఏదీ లేదు' అంటారు రణవీర్. బోస్టన్‌లో రెండు రెస్టారెంట్లు నిర్వహిస్తున్న రణవీర్‌కు మనదేశంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఈయనకు 17 లక్షల మంది చొప్పున ఫాలోయర్లు ఉన్నారు. ఫేస్‌బుక్‌లో ఏకంగా 33 లక్షల మంది ఫాలో అవుతున్నారు. రణవీర్ నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 50 లక్షల పైనే.
ఇంట్లో తాను చేసే వంటల్లోనూ ఎక్కువగా కొత్తిమీర వాడే రణవీర్ బ్రార్.. కొత్తిమీర ఉపయోగించి చేసే వంటల రుచే వేరన్నారు. కళాయిలో ముందే వేయించుకుని వంట ప్రారంభించినా లేదంటే వంటంతా పూర్తయిన తరువాత దానికి కొత్తిమీర యాడ్ చేసినా కూడా మంచి రుచి వస్తుందని చెప్పారు.
'కొత్తిమీరలోని ప్రతి భాగమూ ఉపయోగకరమైనదే. అందుకే గుర్తింపు ఇవ్వాలంటూ కొద్దిరోజుల కిందట ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. కొత్తిమీరను నేషనల్ హెర్బ్‌గా గుర్తించాలని పిటిషన్ వేద్దామని ఆ పోస్ట్‌లో ఆయన ప్రతిపాదించారు. రణవీర్ పెట్టిన ఈ పోస్ట్‌పై ఆసక్తికరమైన చర్చ నడిచింది. రణవీర్ ప్రారంభించే పిటిషన్‌కు మద్దతివ్వడం ఎలా అంటూ నెటిజన్లు అడగడం ప్రారంభించారు.
దాంతో షష్ట్రaఅస్త్రవ.శీతీస్త్ర లో గత ఏడాది ఆయన పిటిషన్ వేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండిస్టీస్ మినిస్ట్రీని అడ్రస్ చేస్తూ ప్రారం భించిన ఈ పిటిషన్‌పై ఇప్పటికే 5,500 మంది సంతకాలు చేశారు. రాణికి కిరీటం లేకపోతే ఎలా ఉంటుందో వంటల్లో కొత్తిమీర లేకపోయినా అలానే ఉంటుందని అని ఈ పిటిషన్‌పై సంతకం చేసిన ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు.
ఫుడ్ సైన్సెస్ అండ్ న్యూట్రిషన్ ఎన్‌సైక్లోపీడియా ప్రకారం.. కొత్తిమీర క్రీస్తుపూర్వం 5000 ఏళ్ల కిందటి నుంచే ఉంది. జీర్ణ, శ్వాస, మూత్రకోశ సంబంధిత సమస్యల నివారణకు గ్రీకులు, రోమన్లు కొత్తిమీరను వాడినట్లుగా చరిత్రలో ఉంది. చైనా, భారత్, యూరప్‌లో వేల ఏళ్ల కిందట నుంచే కొత్తిమీర సాగు ఉంది. యూరప్, మధ్యధరా, ఉత్తర ఆఫ్రికా, ఉత్తర-దక్షిణ అమెరికాలు, చైనా, బంగ్లాదేశ్‌లో కొత్తిమీర సాగు, వాడకం విస్తారంగా ఉంది. మనదేశంలోని అన్ని కాలాల్లో, అన్ని ప్రాంతాల్లో కొత్తిమీర పండిస్తారని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లోని వెజిటబుల్ సైన్స్ డివిజన్ హెడ్ డాక్టర్ భోపాల్‌సింగ్ తోమర్ తెలిపారు.'నలభై ఏళ్ల కిందటి వరకు మనదేశంలో కొత్తిమీర నగరాలలో మాత్రమే అందుబాటులో ఉండేది. శీతాకాలంలో మాత్రమే దొరికేది. కానీ, ఇప్పుడు ఏడాది పొడవునా, అన్నిచోట్లా దొరుకుతోంది' అన్నారు తోమర్. రుచి కోసమే కాకుండా ఆరోగ్యపరంగా కలిగే ప్రయోజనాల రీత్యా కొత్తిమీర వాడకం పెరుగుతోంది.
కొలెస్ట్రాల్ తగ్గించడంలో, డయాబెటిస్‌ను అదుపులో ఉంచడంలో కొత్తిమీర ఉపయోగపడుతుందనీ పేర్కొన్నారు. ఎనిమిది కోట్ల మంది డయాబెటిస్ రోగులున్న మనదేశంలో ఏటా 1.7 కోట్ల మంది హృదయ సంబంధిత వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్నారు. మరి కొలెస్ట్రాల్‌ను అదుపుచేసే కొత్తిమీర సూపర్‌ఫుడ్ అంటారు










