Jul 07,2023 22:51
  • 'మోడీ ఇంటి పేరు' కేసులో శిక్షపై స్టే విధించడానికి గుజరాత్‌ హైకోర్టు నిరాకరణ
  • సుప్రీంకు వెళ్తాం : కాంగ్రెస్‌

గాంధీనగర్‌, న్యూఢిల్లీ : పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీకి గుజరాత్‌ హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ కేసులో తనను దోషిగా నిర్థారించడానిు, తనకు విధించిన రెండేళ్ల శిక్షను నిలిపివేయాలంటూ రాహుల్‌ గాంధీ వేసిన స్టే పిటిషన్‌ను గుజరాత్‌ హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఈ కేసులో సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పును అది సమర్థించింది. 'రాహుల్‌ ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 10 క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటునాురు. ఇక ఈ కేసులో ఆయనకు కింది కోర్టు శిక్ష విధించడం సరైనదే, న్యాయపరమైనదే. ఈ శిక్షను నిలిపివేసేందుకు ఎలాంటి కారణాలు కన్పించట్లేదు. అందుకే పిటిషనర్‌ అభ్యర్థనను కొట్టివేస్తునాుం'' అనిజస్టిస్‌ హేల్మండ్‌ ప్రచక్‌ తీర్పు వెలువరించారు. రాహుల్‌ పిటీషన్‌పై మే రెండునే విచారణను ముగించిన హైకోర్టు శుక్రవారం తీర్పును వెల్లడించింది. ప్రజలకు ప్రాతినిధ్యం వహించేవారు సచ్ఛీలతను కలిగి ఉండాలని హైకోర్టు పేర్కొంది. వీర సావర్కర్‌ మనవడు చేసిన ఫిర్యాదును కూడా హైకోర్టు ప్రస్తావించింది. 2019 లోకసభ ఎనిుకల ప్రచారంలో భాగంగా కర్ణాటకలో మాట్లాడుతూ 'దొంగలందరికీ మోడీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటుంది' అనిరాహుల్‌ వ్యాఖ్యనించారు. ఈ వ్యాఖ్యలకుగాను రాహుల్‌ గాంధీకి వ్యతిరేకంగా ఈ పరువు నష్టం కేసును సూరత్‌ కోర్టులో బిజెపి శాసనసభ్యుడు పుర్ణేష్‌ మోడీ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ట్రయల్‌ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ ఏడాది మార్చిలో తీర్పు వెలువరించింది. ట్రయల్‌ కోర్టు తీర్పు వెలువరించిన 24 గంటల్లోనే రాహుల్‌పై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం, పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా నిర్థారణయి, కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది. ట్రయల్‌ కోర్టు తీర్పుపై రాహుల్‌ సూరత్‌ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు. రెండేళ్ల జైలు శిక్షను నిలుపుదల చేయాలని.. అలాగే తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును సైతం నిలిపివేయాలంటూ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఏప్రిల్‌లో విచారణ జరిపిన సెషన్స్‌ కోర్టు.. ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకుమాత్రం నిరాకరించింది. దీంతో రాహుల్‌ గాంధీ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు.

  • సుప్రీంకు వెళ్తాం : కాంగ్రెస్‌

పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీపై విధించిన శిక్షపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన గుజరాత్‌ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కాంగ్రెస్‌ నాయకులు శుక్రవారం వెల్లడించారు. కోజికోడ్‌లో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్‌) కెసి వేణుగోపాల్‌ మాట్లాడుతూ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ఆప్పీల్‌కు వెళ్తామని చెప్పారు. గుజరాత్‌ హైకోర్టు తీర్పును 'న్యాయం యొక్క అపహాస్యం'గా రణదీప్‌ సూర్జేవాలా అభివర్ణించారు.