Sep 12,2023 16:15

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : ఆదోనిలోని ఎస్‌కేడి కాలనీలో పురాతన బావి చుట్టూ కంచ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపల్‌ ఇంజనీరు నాగభూషణం రెడ్డి అవార్డు ఇన్చార్జి చంద్రశేఖర్‌ రెడ్డితో కలిసి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి మాట్లాడారు. రూ పది లక్షలతో పురాతన బావి చుట్టూ కంచే ఏర్పాటు పనులు మొదలయ్యాయన్నారు. పురాతన బావిలో నీరు నిండుగా ఉందన్నారు స్థానికులు వ్యర్థాలు బావిలో పారవేయడం వల్ల దుర్వాసన వస్తుందని గతంలో ఫిర్యాదులు వచ్చాయన్నారు. స్కూల్‌ సమీపంలో భావి ఉందని ప్రమాదవశాత్తు చిన్నారులు బావిలో పడే ప్రమాదం ఉందని గమనించమన్నారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. బావిలోని పూడిక తొలగించి ఉన్న నీటిని తోడి శుభ్రం చేసి మోటార్‌ ఏర్పాటు చేయిస్తామన్నారు. బావిలో ఊట పుష్కలంగా ఉందని ఇతర అవసరాలకు ఉపయోగించుకునేందుకు అందుబాటులోకి తెస్తామన్నారు. పనులను సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్‌ రఘుకి సూచించామని మున్సిపల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు నాగభూషణం రెడ్డి తెలిపారు.