Oct 20,2023 11:43

తెలంగాణ : అధికారిక భవనంలో బిఆర్‌ఎస్‌ తన పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తుందంటూ .. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధికారిక నివాసం ప్రగతి భవన్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ ఫిర్యాదుపై తదుపరి చర్యల్లో భాగంగా అధికారులు గురువారం సుదీర్ఘంగా చర్చించారు. నిన్న సాయంత్రం సిఇఒ వికాస్‌ రాజ్‌తో హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రోస్‌ సమావేశమై చర్చించారు. ఈ ఫిర్యాదులో ఎవరికి నోటీసులు ఇవ్వాలనే దానిపై చర్చలు జరిపారు. చివరకు.. ప్రగతి భవన్‌ నిర్వహణ అధికారులకు నోటీసులు పంపారు.