ప్రజాశక్తి-కొత్తచెరువు రూరల్ (అనంతపురం) : తిరుమల తిరుపతి దేవస్థానం నూతన బోర్డు సభ్యునిగా ఎంపికైన అశ్వర్థ నాయక్‌ను మంగళవారం వైసిపి నాయకులు అభినందించారు. శ్రీ సత్య సాయి జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ అవుటాలా రమణారెడ్డి, కొత్తచెరువు వైసిపి మండల కన్వీనర్ జగన్మోహన్ రెడ్డి, కొడపగాని పల్లి సర్పంచ్ నరసింహారెడ్డి, అనంతపురంలోని టీటీడీ బోర్డు మెంబర్ స్వగృహంకు వెళ్లి ఆయనను పూలమాలలు, శాలవలతో సత్కరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా పదవులను కల్పిస్తుందని, జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఎన్నో పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజల మన్ననలు పొందాడని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు వైసీపీలోనే న్యాయం జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదన్నారు.










