ఇంఫాల్ : రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాకాండతో నష్టపోయిన రైతులకు మణిపూర్ ప్రభుత్వం రూ.38.06 కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మే 3 నుంచి జరుగుతున్న హింసాకాండ కారణంగా రాష్ట్రంలో 9,719 హెక్టార్ల భూమిలో పంట నష్టం జరిగిందని ఒక స్వతంత్ర రైతు సంఘం నిర్వహించిన సర్వే ఆధారంగా ప్రభుత్వం అంచనాకు వచ్చింది.










