ఖాట్మాండు : నేపాల్‌లోని నేపాల్‌గంజ్ పట్టణంలో మతఘర్షణలు చెలరేగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అధికారులు పట్టణంలో లాక్‌డౌన్ విధించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ముస్లిములను కించపరుస్తూ సోషల్ మీడియాలో ఓ బాలుడు పోస్టుపెట్టడంతో ఈ ఘర్షణలు ప్రారంభమయ్యాయి. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి నిరవధిక కర్ఫ్యూ అమల్లోకి తెచ్చారు. పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారని, లాక్‌డౌన్ సమయంలో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, గుంపులు గుంపులుగా తిరగడానికి అనుమతించరని పోలీస్ అధికారి సంతోష్ రాథోడ్ తెలిపారు.










