- విద్యార్థులు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ర్యాలీ..
ప్రజాశక్తి-పత్తికొండ (కర్నూలు) : ఏపీ మోడల్ స్కూల్‌లో ఉపాధ్యాయులు లేక చదువుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. కలెక్టర్ గారు మీరైనా మాపై దయవుంచి ఉపాధ్యాయులు నియమించాలని విద్యార్థులు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వేడుకుంటున్న సంఘటన పత్తికొండలో చోటుచేసుకుంది. మంగళవారం పత్తికొండలో ఏపీ మోడల్ స్కూల్ నుంచి విద్యార్థులు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కలెక్టర్ గారు ఉపాధ్యాయులు నియమించండి మేము చదువుకోవాలి ఉన్నతంగా ఎదగాలని అనే నిదానంతో ర్యాలీగా వచ్చి ఆర్డీవో కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి వినోద్, మాజీ ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు సురేంద్ర మాట్లాడుతూ.. ఏపీ మోడల్ స్కూల్లో ఆరు నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులు సుమారుగా 1000 మంది విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. వారికి జువాలజీ బాటని మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మరిన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేరన్నారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో చదువుకోవడానికి విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ పరీక్షలు ఫెయిల్ అవుతామేమో అని భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు ఏపీ మోడల్ స్కూల్లో సమస్యలు ఉన్నాయని ఉన్నత అధికారులకు తెలియజేసిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు విద్యార్థులు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అడ్మినిస్ట్రేట్ అధికారి సతీష్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు అబ్దుల్లా రవి వినోదు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










