ప్రజాశక్తి - ఆలమూరు :గత నెల(అక్టోబర్)10న ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి హైదరాబాద్ లో తెలుగులో ''మన సంస్కఅతి - సాంప్రదాయం'' పై జరిగిన ప్రతిభా పరీక్షలలో మండలంలోని చెముడులంకకు చెందిన అడబాల ధర్మయ్య, సత్యవతి దంపతుల కుమార్తె ప్రణవి నాగదేవి ఉత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానం పొంది విజేతగా నిలిచింది. దీంతో ప్రణవికి హైదరాబాదులో ప్రముఖుల చేతుల మీదుగా గురువారం ప్రశంసా పత్రం, అవార్డు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం విలేకరులతో విద్యార్థి ప్రణవి మాట్లాడుతూ స్థానిక ప్రైవేట్ స్కూల్ నందు 8వ తరగతి చదువుతు ఉపాధ్యాయుల ప్రాద్బలంతో ఈ ఘనత సాధించినట్లు తెలిపింది. దీంతో ప్రణవికి వైసిపి మండల కన్వీనర్, సర్పంచ్ తమ్మన శ్రీనివాస్, వైసీపీ నేతలు దొండపాటి చంటి, అడబాల వీర్రాజు, దొండపాటి వెంకటేశ్వరరావు, దొండపాటి శ్రీను, పాలూరి రాధాకఅష్ణ, నాగిరెడ్డి సత్యనారాయణ, బుడ్డిగ వీర వెంకట్రావు, దొండపాటి వెంకటరామయ్య, మోటూరి సురేష్, రాయుడు వెంకటేష్, తమ్మన హరి, దొండపాటి శ్రీరాములు, అడబాల శ్రీనివాస్, తదితరులు అభినందనలు తెలియజేశారు.










