Oct 29,2023 15:44

కోసిగి: కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఓ రైతుకు చిరుతపులి పిల్ల దొరికింది. తిమ్మప్పకొండ వెనుక రైతు దంపతులు తిప్పలదొడ్డి తాయమ్మ, తిక్కయ్యలు ఈ నెల 20న మిరప పొలంలో కలుపు తీస్తుండగా.. అరుపులు వినిపించి వెళ్లిచూడగా.. అప్పుడే పుట్టిన జంతువు పిల్ల కనిపించింది. దాన్ని దగ్గరకు తీసుకుని పాలు పట్టించారు. దాని గోళ్లను బట్టి చిరుత పులి పిల్లగా నిర్ధారించుకున్నారు. ఈ వారం రోజుల నుంచి దానికి పాలు ఇస్తున్నారు. పులి కూనను చూసేందుకు చుట్టుపక్కల జనం వస్తున్నారు. అయితే దానిని పెంచడం నేరమని కొందరు చెప్పడంతో చిరుత పిల్లను కొండ పరిసరల్లో వదిలేశారు.