Oct 28,2023 14:24

గుంటూరు: రాజమహేంద్రవరం జైలులో టిడిపి అధినేత చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం ఉందని టిడిపి సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. బాబు ఆరోగ్యం, భద్రత విషయంలో అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. గుంటూరులోని టిడిపి కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.చంద్రబాబు అరెస్టుకు ముందే.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి బంధువు రవికిరణ్‌ రెడ్డిని జైళ్ల డీఐజీగా నియమించారన్నారు. మంత్రి సురేశ్‌ బంధువు బాబ్జి వైద్యశాఖ సంచాలకుడిగా ఉండి.. జైలు వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. జరుగుతున్న పరిణామాలన్ని ఆందోళన కలిగిస్తున్నాయని.. అందుకే చంద్రబాబు ఏసీబీ న్యాయమూర్తికి లేఖ రాశారని వివరించారు. ఇప్పుడు వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్‌ చేసిన వ్యాఖ్యలు తమ అనుమానాల్ని బలపరుస్తున్నాయని ధూళిపాళ్ల అన్నారు.