అమరావతి: ఉచిత ఇసుక పథకంపై సీఐడీ నమోదు చేసిన కేసులో టిడిపి అధినేత చంద్రబాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ బుధవారం విచారణకు వచ్చే అవకాశముంది. ఉచిత ఇసుక పథకం పేరుతో ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూర్చారనే ఆరోపణలతో ఏపీఎండీసీ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.










