Nov 03,2023 13:40

తెలంగాణ : టిడిపి అధినేత చంద్రబాబు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆస్పత్రి వైద్యులు ఆయన్ను డిశ్చార్జి చేశారు. చంద్రబాబుతోపాటు ఆయన భార్య భువనేశ్వరి ఉన్నారు. ఏఐజీ నుంచి ఆయన నేరుగా జూబ్లీహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి వెళ్లే అవకాశముంది. అక్కడే క్యాటరాక్టు సమస్యకు వైద్యులు చంద్రబాబుకు శస్త్రచికిత్స చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.