అమరావతి:అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రబాబు నాయుడు బెయిల్‌పై విడుదల కావడంపట్ల సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన బెయిల్ కాలంలో ఆంక్షలు విధించటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సిఐడి కక్షసాధింపు వైఖరితో వ్యవహరిస్తున్నట్లున్నదన్నారు.
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బుడతనాపల్లి గ్రామంలో బుధవారం జరిగిన ప్రజారక్షణ భేరి సభలో మాట్లాడుతూ బిజెపి వైసిపి కుమ్మక్కయి చంద్రబాబును జైల్లో పెట్టారని తెలుగుదేశం శ్రేణులన్నీ భావిస్తుండగా తనకు సంఘీభావం ప్రకటించినందుకు బిజెపికి చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేయడం శోచనీయమని అన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టించినందుకా ఈ ధన్యవాదాలని ఆయన ప్రశ్నించారు. బిజెపి బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు తెలుగుదేశం లోనవటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బిజెపి నిజస్వరూపాన్ని గమనించి రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద బిజెపికి వ్యతిరేకంగా పోరాడేందుకు తెలుగుదేశం ముందుకు రావాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలియజేశారు. భాషా ప్రయోక్త రాష్ట్రాలకోసం కమ్యూనిస్టు పార్టీ పోరాడి సాధించింది. కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యతకోసం నిలబడిన ఏకైక రాజకీయ పార్టీ సిపిఐ(యం) అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.










