అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైన నేపథ్యంలో ... టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. రాజమండ్రి, కుప్పం, మంగళగిరి, తదితర ప్రాంతాల్లో టిడిపి నేతలు, కార్యకర్తలు టపాసులు పేల్చారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని బాణసంచా కాల్చారు. చంద్రబాబుపై పెట్టిన ఏ అక్రమ కేసూ నిలబడదని అచ్చెన్నాయుడు అన్నారు. జైలు నుంచి బయటకు చంద్రబాబు కాలుపెట్టిన సమయం నుంచి జగన్ పతనం ప్రారంభమైందని నేతలు హెచ్చరించారు. చంద్రబాబును ఇక ఏశక్తీ ఆపలేదని ధీమా వ్యక్తం చేశారు. అన్ని కేసులూ అక్రమమని త్వరలోనే తేలిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.










