- టిడిపి నియోజకవర్గ ఇంచార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి
ప్రజాశక్తి-మంత్రాలయం(కర్నూలు) : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అరెస్టు ముమ్మాటికి జగన్ కక్ష సాధింపు చర్యలే అని టిడిపి నియోజకవర్గ ఇంచార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి విమర్శించారు. శనివారం చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నల్ల చొక్కాలను ధరించి స్థానిక రాఘవేంద్ర సర్కిల్లో నిరసన వ్యక్తం చేసి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా నారా చంద్రబాబు నాయుడిని ఏ చట్టం ప్రకారం అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. డిజైన్ టెక్ సంస్థ ఒప్పందం ప్రకారము అన్ని వస్తువులు టెక్నాలజీ స్టాఫ్ వేర్ తో సహా ఇచ్చిందని, అన్ని సరి చూసుకొని 2020లో మీ ప్రభుత్వ హాయంలోని డిజైన్ టెక్ సంస్థకు అభినందన పత్రం ఇచ్చిన మాట వాస్తవమా కాదా ప్రశ్నించారు. గుజరాత్ తో సహా అనేక రాష్ట్రాలు చేసుకున్న ఈ ఒప్పందాన్ని ఏ విధంగా తప్పు అవుతుందనే విషయాన్ని జగన్ రెడ్డి చెప్పాలన్నారు. ఈ కేసులో ఎలాంటి కుంభకోణం లేదనడానికి అందులో శిక్షణ తీసుకున్న రెండు లక్షలు 13 వేలమంది విద్యార్థులే ప్రత్యక్ష సాక్షులను ఇందులో 72,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని దీనిని కుంభకోణం అని ఏ విధంగా అంటారు అని స్వయంగా హైకోర్టు చెప్పి జగన్ రెడ్డి కి మొట్టికాయలు వేసిన విషయం మరచినట్లు ఉన్నారన్నారు. జగన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నారని చంద్రబాబు నాయుడిని 16 నిమిషాలైనా జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. ఎఫ్‌ఐఆర్ కాఫీలో ఎలాంటి కారణాలు లేవు ఇది ప్రభుత్వ అణచివేత దోరణి అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అని ధీమా వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారిని తక్షణమే విడుదల చేయాలని లేని పక్షంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు, చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి, పూజారి వ్యాసరాజ్ స్వామి, బీసీ సెల్ అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి, అశోక్ రెడ్డి, విజయరామరెడ్డి, ఎల్లారెడ్డి, పవన్ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి,చావిడి వెంకటేష్,గోపాల్ రెడ్డి, ఏబు, చిలకలదోన హనుమంతు,అబ్దుల్,పవన్ రెడ్డి, తిక్క స్వామి గౌడ్, సుగురు నాగేష్, బాల్కనీ నరసింహులు, తిమ్మాపురం కేశవ,చౌటుపల్లి శివరాముడు,దబ్బల రోగప్ప, మరియు అనుబంధ నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు ఐ టీడీపీ సభ్యులు, టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.










