ప్రజాశక్తి-తిరుమల : తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మౌత్సవాలు ముగింపునకు చేరుకున్నాయి. చివరి రోజైన నేడు వరాహ పుష్కరిణలో స్వామివారి చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ప్రతినిధిగా చక్రత్తాళ్వార్‌కు అర్చకులు స్నపన తిరుమంజనం, అభిషేకం నిర్వహించారు. చక్రస్నానం తర్వాత స్వామి వారిని ఆనంద నిలయానికి చేర్చారు. ఆ తర్వాత భక్తులు శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆదివారం అందులోనూ నేడు దసరా పర్వదినం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. స్వామి వారిని నిన్న 77,187 మంది దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.3.06 కోట్లు వచ్చింది.










