పాట్నా : మహిళా రిజర్వేషన్ బిల్లును మోడీ ప్రభుత్వం అమలు చేయదు అని బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఆరోపించారు. దశాబ్దాల తరబడి వేచి ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఎట్టకేలకు మోడీ ప్రభుత్వం లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై బుధవారం సభలో చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా బుధవారం పాట్నాలో నితీష్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. 'ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందేందుకు మాత్రమే మోడీ ప్రభుత్వం ఈ బిల్లుకు తీసుకొచ్చింది. మహిళా రిజర్వేషన్ బిల్లును వారు అమలు చేయరు. వారు అలా చేయాలనుకుంటే దానిని ముందే చేసి ఉండేవారు. మహిళా రిజర్వేషన్ అవసరమని, మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. దాన్ని అమలు చేయడం లేదు. కులాల వారీగా జనాభా గణన చేయాలని మేం వారికి చెప్పాం. ఈ విషయాన్నే డిమాండ్ చేశాం.' అని ఆయన అన్నారు.










