Sep 14,2023 13:37

ప్రజాశక్తి-మంత్రాలయం (కర్నూలు) : మంత్రాలయంలో కొలువైన శ్రీ రాఘవేంద్రస్వామిని గురువారం ప్రముఖులు దర్శించుకున్నారు. టిటిడి పాలక మండలి సభ్యులు వై.సీతారామిరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌, గుంతకల్లు వైసిపి నాయకులు మురళి రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంధ్రతీర్థులు వారికి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, ఎస్‌ఐ వేణు గోపాల్‌ రాజు, సర్పంచ్‌ తెల్లబండ్ల భీమయ్య, వైస్‌ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.