Nov 07,2023 15:41

హైదరాబాద్‌: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో శస్త్ర చికిత్స పూర్తయింది. ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి వైద్యులు ఆయనకు విజయవంతంగా కాటరాక్ట్‌ ఆపరేషన్‌ను నిర్వహించారు. చంద్రబాబుకు 45 నిమిషాల్లో కాటరాక్ట్‌ ఆపరేషన్‌ను వైద్యులు పూర్తి చేశారు. ఆపరేషన్‌ ముగిసిన వెంటనే ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి బయలుదేరారు. మరో వారం రోజుల పాటు చంద్రబాబు విశ్రాంతి తీసుకోనున్నారు. మరోవైపు చంద్రబాబును చూసేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ ఆభిమానులు ఆసుపత్రికి వచ్చారు. చంద్రబాబు కంటి ఆపరేషన్‌ విజయవంతం కావడం పట్ల టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబు 50 రోజులకు పైగా రాజమండ్రి జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో కంటికి ఆపరేషన్‌ నేపథ్యంలో షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే.