ప్రజాశక్తి -తుగ్గలి : మండలం పరిధిలోని ఎర్ర గుడి గ్రామంలో ఆర్ అండ్ బి రోడ్లు శిథిలా వ్యవస్థకు చేరుకున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ సిపిఎమ్ ఆధ్వర్యంలో శుక్రవారం రోడ్డుపైనే వరి నాట్లను నాటి నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి శ్రీరాములు, మండల కమిటీ సభ్యుడు కొండారెడ్డి మాట్లాడుతూ గుత్తి పత్తికొండ ప్రధాన రహదారి అయిన ఎర్రగుడి రోడ్డు పూర్తిగా పాడైపోయిందన్నారు. దీంతో రాత్రి వేళల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వారి తమ ఆందోళన వ్యక్తం చేశారు. పలుసార్లు ఆర్ అండ్ బి అధికారులకు చెప్పినప్పటికీ వారు నిమ్మకు నీరే త్తి నట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆర్ అండ్ బి అధికారులపై మండిపడ్డారు. ఎర్రగుడి నుండి దాదాపు 5 కిలోమీటర్ల మేర పూర్తిగా రోడ్లన్నీ దెబ్బతిన్నాయని, అధికారులు ఇంతవరకు మరమ్మతులు కూడా చేయలేదన్నారు. చెన్నై,బెంగళూరు నుండి ఎక్కువగా మంత్రాలయం కు వాహనాలు ఎక్కువగా తిరుగుతుంటాయని, అదేవిధంగా ద్విచక్ర వాహనాలు కూడా ఎక్కువ తిరుగుతుంటాయన్నారు. గుంతల పడిన రోడ్లలో ప్రయాణాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తానన్నారు. ఇప్పటికైనా అధికారులు గుత్తి పత్తికొండ ప్రహదాన రహదారి ఎరుగుడి రోడ్డులో మరమ్మతులైన చేయాలని, లేక పూర్తిగా సిమెంటు రోడ్డు అయినా వేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సభ్యులు రాజు,లింగన్న,జయరాము, గ్రామస్తులు భీమన్న, వెంకటేశు,రామంజి, ఎర్రి స్వామి,ఓబులేసు,గోవిందు, సాలప్ప, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.










