Nov 05,2023 10:10

తిరుపతి : రాష్ట్రంలో భూకబ్జాల పాలన సాగుతుందని, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అవకాశవాద అబద్దాల ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం ఏ గఫూర్ మండిపడ్డారు. సిపిఎం ప్రజా రక్షణ బేరి బస్సు యాత్ర తిరుపతి నుంచి బయలుదేరి రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు వరకు చేరింది. ఈ యాత్ర బృందానికి అడుగడుగునా ప్రజలు, ప్రజా సంఘాలు,సిపిఎం కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గఫూర్ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో దయానియా పరిస్థితులను ప్రజలు ముందుకు తీసుకోవడానికి యాత్ర ముఖ్య ఉద్దేశం అన్నారు.  విభజన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చని అవకాశవాద , అరాచక కేంద్ర ప్రభుత్వానికి ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీలు బిజెపిని సంగతి కొన్ని మోస్తున్నాయన్నారు. ప్రజలపై విపరీతమైన భారాలు మోపుతున్నాయని అన్నారు. జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు,ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో ప్రభుత్వ,ప్రైవేటు భూములను ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు. ఒక్కో ఎమ్మెల్యే 200 కోట్లు నుంచి 500 కోట్ల వరకు సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నారని, పేద ప్రజలకు జానెడు ఇంటి స్థలం ఇచ్చేందుకు వారికి మనసు లేదన్నారు. తప్పును ప్రశ్నిస్తే అధికార పార్టీ కంటే ముందు పోలీసులే ఓవర్ యాక్షన్ చేస్తూ వైసిపి కార్యకర్తలు లాగా వ్యవహరిస్తున్నారు. అసలు పోలీసులకు సిగ్గుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి ప్రజలు శాశ్వతం అని పోలీసులు గుర్తించాలన్నారు. కేంద్రం లోను రాష్ట్రంలోనూ దుర్మార్గ పాలన కొనసాగుతుందని, దీన్ని వ్యతిరేకించేందుకు నవంబర్ 15న విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద బహిరంగ సభ జరుగుతుందని, ప్రజలందరూ హాజరై సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధికి టిటిడి బోర్డు ఒక్క శాతం నిధులు ఇస్తామని తీర్మానిస్తే, బిజెపి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకుందన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి,చంద్రబాబు నాయుడులు కుర్చీలాట ఆడుతున్నారని, సిపిఎం మాత్రం ప్రజా సమస్యలే దేంగా మీ ముందుకు వచ్చిందన్నారు. 9 ఏళ్ల క్రితం తిరుపతికొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ జిల్లాకు,రాష్ట్రానికి ఇచ్చిన హామీ ఒకటి నెరవేర్చలేదని విమర్శించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి భూ బకాసుల వ్యవహరిస్తూ ప్రభుత్వ భూములు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ యాత్రలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె ఉమామహేశ్వరరావు, ఎం భాస్కరయ్య, దయా రమాదేవి, జిల్లా నాయకులు టి సుబ్రమణ్యం, ఓ వెంకటరమణ, ఎస్ జయ చంద్ర, హరినాథ్, సెల్వరాజ్, రాజేశ్వరి, బుజ్జి, వేణు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

-----------------0000000000000000000---------------------------

ప్రజా సమస్యలే అజెండాగా ... సిపిఎం ఆధ్వర్యంలో తలపెట్టిన ' ప్రజా రక్షణ భేరి ' ఏడో రోజు ఆదివారం తిరుపతి జిల్లా రేణిగుంటలో ప్రారంభమైంది. బహిరంగ సభలో నేతలు మాట్లాడుతూ ... వెనుకబడిన ప్రాంతాలకు లక్ష కోట్ల రూపాయలతో ప్యాకేజీ ఇవ్వాలన్నారు. కర్నూలుకు హైకోర్టు, విశాఖ - విజయవాడకు బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక సంస్థలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. పనులకు రక్షణ కల్పించాని ఆధునిక పరికరాల సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు.

11