Sep 26,2023 10:27

న్యూఢిల్లీ : బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బిఎస్‌పి) నేత, అమ్రోహ్ ఎంపీ డానిష్‌ అలీకి సిపిఎం సంఘీభావం తెలియజేసింది. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌, సుభాషిణీ అలీ ఆయన నివాసానికి వెళ్లి మాట్లాడారు. డానిష్‌ అలీపై పార్లమెంటు నిండు సభలో బిజెపి ఎంపి రమేశ్‌ బిధూరి బరితెగించి దూషణల దాడికి దిగడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. తక్షణమే బిధూరిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి సందర్భాల్లో సిపిఎం నుంచి తనకు కచ్చితంగా మద్దతు లభిస్తుందని విశ్వసించానని, ఆ పార్టీ నాయకులు ఇంటికి వచ్చి సంఘీభావం తెలియజేసినందుకు సిపిఎంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని డానిష్‌ తెలిపారు.