Nov 07,2023 16:16

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీఎం మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కోదాడ నియోజకవర్గం నుంచి మట్టిపల్లి సైదులు, మునుగోడు నుంచి దోనూరు నర్సిరెడ్డి, ఇల్లందు నుంచి దుగ్గి కృష్ణ.. ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 14 మంది అభ్యర్థులతో తొలి జాబితా, ఇద్దరు అభ్యర్థులతో రెండో జాబితాను ఇప్పటికే సీపీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగనున్నారు.