Nov 06,2023 15:49

హైదరాబాద్‌: నేటి నియోజక వర్గాల పర్యటన లో భాగంగా దేవకద్రకు వ్యవసాయ క్షేత్రం నుండి వాయుమార్గాన బయలుదేరిన సీఎం కేసీఆర్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో అప్రమత్తమైన పైలట్‌ మార్గమధ్యం నుండి తిరిగి వ్యవసాయ క్షేత్రానికి హెలికాప్టర్‌ ను మళ్లించి సురక్షితంగా లాండింగ్‌ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ మరో ప్రత్యామ్యాయ హెలికాప్టర్‌ను ఏవియేషన్‌ సంస్థ వారు ఏర్పాటు చేయనున్నారు. మరి కాసేపట్లో హెలికాప్టర్‌ రాగానే బీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ నేటి పర్యటనను యథావిధిగా కొనసాగించనున్నారు.